Usthad baghath Singh: ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ రిలీజ్ …అదిరిపోయే లుక్ లో పవన్ కళ్యాణ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటు సినిమాల్లో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. చివరగా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుపుకుంటుంది.

 

ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఇలా ఉండగానే పవన్ కళ్యాణ్ నుండి మరో సినిమా అప్డేట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. అంతేకాకుండా సినిమా టైటిల్ కింద మనల్ని ఎవడ్రా ఆపేది అనే క్యాప్షన్ తో సినిమా పోస్టర్ ను విడుదల చేశారు.

 

ఈరోజు ఈ సినిమా షూటింగ్ సైతం ప్రారంభిస్తున్నారు. ఇక తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. పోస్టర్ను చూస్తుంటే ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా భగత్ సింగ్ అని పేరు పెట్టడంతోనే సినిమాలో అన్యాయాలను ఎదిరించే పౌరుడిగా పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నట్లు అర్థమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *