Chiranjeevi : “వాల్తేరు వీరయ్య” మూవీకి లాభాలే లాభాలు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్య అనే మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా … మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మించారు. బాబి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ ఒక కీలకమైన పాత్రలో నటించాడు.

 

మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో హీరోగా నటించగా రవితేజ కూడా ఈ మూవీ లో కీలకమైన పాత్రలో నటించడంతో ఈ మూవీ పై విడుదలకు ముందు ప్రేక్షకులు అదిరిపోయే రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. దానితో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 88 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి కనుక జనవరి 13 వ తేదీన 89 కోట్ల భారీ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది.

 

అలా భారీ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటివరకు 21 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 134.83 కోట్ల షేర్ , 230.02 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీ 21 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 45.83 కోట్ల లాభాలను అందుకొని భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *