Anirudh : “అనిరుద్” ఒక్కో మూవీకి ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

అద్భుతమైన టాలెంట్ ఉన్న మ్యూజిక్ దర్శకులలో ఒకరు అయినటువంటి అనిరుద్ రవిచంద్రన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనిరుద్ రవిచంద్రన్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీలకు అద్భుతమైన సంగీతాన్ని అందించి , సినిమా విజయంలో కీలకపాత్రను పోషించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ సంగీత దర్శకుడు ఎక్కువ శాతం తమిళ సినిమాలకు మ్యూజిక్ ను అందించాడు.

 

అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన అజ్ఞాతవాసి , నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన నానిస్ గ్యాంగ్ లీడర్ వంటి తెలుగు మూవీ లకు కూడా అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించి తెలుగు సినీ ప్రేమికులకు మనసు కూడా దోచుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే అనిరుద్ రవిచంద్రన్ , కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన విక్రమ్ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ లోని పాటలు పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాయి.

 

అనిరుద్ రవిచంద్రన్ , ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ కి కూడా సంగీతం అందించబోతున్నాడు. ఇలా ప్రస్తుతం తమిళ్ మరియు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న అనిరుద్ రవిచంద్రన్ ఒక్కో మూవీ కి 6 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇండియా లోనే అత్యధిక రెమ్యూనిరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ రవిచంద్రన్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *