Chiranjeevi : చిరంజీవి కెరీర్లో 100 కోట్ల కలెక్షన్లను సాధించిన సినిమాలు ఎన్నో తెలుసా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను కలిగి ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి కొన్ని సంవత్సరాల పాటు రాజకీయాలపై ఆసక్తిని చూపించి సినిమాలకు దూరంగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా చాలా సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి “ఖైదీ నెంబర్ 150” మూవీతో సినిమాల్లోకి తిరిగి రీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం చిరంజీవి వరుస మూవీలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే చిరంజీవి తన కెరియర్లో 100 కోట్లకు పైగా కలెక్షన్లను ఏ మూవీ లతో అందుకున్నాడో తెలుసుకుందాం.

 

చిరంజీవి చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత ఖైదీ నెంబర్ 150 మూవీతో 100 కోట్లకు పైగా షేర్ కలక్షన్లను అందుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర తన స్టామినా ఏ మాత్రం తగ్గలేదు అని ఈ మూవీతో నిరూపించుకున్నాడు.

 

ఆ తర్వాత చిరంజీవి భారీ బడ్జెట్ తో రూపొందిన సైరా నరసింహారెడ్డి అనే పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా కలెక్షన్ కొల్లగొట్టింది.

 

సైరా నరసింహారెడ్డి మూవీ తర్వాత చిరంజీవి ఆచార్య మూవీలో నటించాడు. ఈ మూవీతో ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహపరిచిన చిరంజీవి పోయిన సంవత్సరం విడుదల అయిన గాడ్ ఫాదర్ మూవీతో మరోసారి 100 కోట్ల కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు.

 

చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్య మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ విడుదల అయిన మూడు రోజుల్లోనే 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది. ప్రస్తుతం కూడా ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది.

 

ఇలా చిరంజీవి తన కెరీర్లో ఇప్పటివరకు నాలుగు మూవీలతో 100 కోట్ల కలెక్షన్ల మార్క్ ను అందుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *