Pawan Kalyan : “తొలిప్రేమ” మూవీని నైజాం ఏరియాలో అంతకు కొంటే… ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో అద్భుతమైన విజయవంతమైన మూవీ లలో తొలిప్రేమ మూవీ ఒకటి. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన కీర్తి రెడ్డి హీరోయిన్ గ నటించింది. 1998 వ సంవత్సరం విడుదల అయిన తొలిప్రేమ మూవీ అప్పట్లో భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని , బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ ల వర్షాన్ని కురిపించింది.

 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క నైజాం థ్రియేటికల్ హక్కులను దిల్ రాజు కొనుగోలు చేశాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు “తొలిప్రేమ” మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజాగా దిల్ రాజు “తొలిప్రేమ” మూవీ గురించి మాట్లాడుతూ … పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన తొలిప్రేమ మూవీ నైజాం హక్కులను ఆ రోజుల్లో 72 లక్షలు పెట్టి కొన్నాం.

 

ఆ రోజుల్లో ఆ సినిమా 2 కోట్ల 80 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది అని చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే తొలిప్రేమ మూవీ ద్వారా పవన్ కళ్యాణ్ … కీర్తి రెడ్డి … కరుణాకరన్ కు అద్భుతమైన గుర్తింపు లభించింది. తొలిప్రేమ మూవీ కి దేవా సంగీతం అందించగా , వాసుకి , ఆలీ , వేణు మాధవ్ ఇతర ముఖ్య పాత్రలలో నటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *