Jahnavi kapoor: రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరిలో ఎవరికి ఓకే చెబుతుంది…?
శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ టాలీవుడ్ లో అడుగుపెడుతోందని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు జాహ్నవి తెలుగులో ఒక సినిమా కూడా చేయలేదు. అంతేకాకుండా ఒకప్పుడు ఆఫర్లు వచ్చినా జాహ్నవి రిజక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ దేశంలోనే టాప్ లో ఉంది కాబట్టి బాలీవుడ్ హీరోలు హీరోయిన్ లు సైతం తెలుగులో నటించేందుకు సై అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో జాహ్నవి కూడా తెలుగులో సినిమా చేయాలని ఉందని వెల్లడించింది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది అంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది.
ఎన్టీఆర్ 30 మేకర్స్ జాహ్నవిని దింపేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారని జోరుగా ప్రచారం కూడా జరుగుతుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా జాహ్నవి పేరు వినిపిస్తోంది. కాగా టాలీవుడ్ టాక్ ప్రకారం జాహ్నవి వద్దకు రెండు సినిమాల ఆఫర్లు వెళ్లాయని కాగా ఎన్టీఆర్ చరణ్ ఇద్దరిలో ఎవరితో సినిమా చేయాలనే ఆలోచనలో జాహ్నవి ఉన్నట్టుగా టాక్ వినిపిస్తోంది. మరి చివరికి జాహ్నవి ఇద్దరిలో ఎవరిని ఎంచుకుంటుందో చూడాలి.