Suma : ఆ స్టార్ డైరెక్టర్ కు జోడిగా సుమ హీరోయిన్ గా నటించింది అన్న సంగతి తెలుసా..? ఆ డైరెక్టర్ ఎవరంటే..?

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది మొదట ఒక క్రాఫ్ట్ లో పనిచేసే … ఆ తర్వాత మరో క్రాఫ్ట్ లో సెటిల్ అవుతుంటారు. అలాంటి వారిలో ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రచయితగా … దర్శకుడిగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న వక్కంతం వంశీ ఒకరు. వక్కంతం వంశీ తన కెరీర్ ను న్యూస్ రీడర్ గా మొదలు పెట్టి … ఆ తర్వాత నటుడిగా కూడా నటించి … ఆ తర్వాత సినిమాలకు కథ రచయిత గా పనిచేసి … ప్రస్తుతం మూవీలకు దర్శకత్వం వహిస్తున్నాడు. వక్కంతం వంశీ ఎక్కువ శాతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీలకు కథలను అందించాడు.

 

సురేందర్ రెడ్డి , వక్కంతం వంశీ కాంబినేషన్లో తెరకెక్కిన కిక్ రేసుగుర్రం మూవీ లు మంచి విజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే వక్కంతం వంశీ అల్లు అర్జున్ హీరోగా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం వక్కంతం వంశీ , నితిన్ హీరోగా తెరకెక్కుతున్న మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే వక్కంతం వంశీ ఒక మూవీ లో హీరోగా కూడా నటించాడు. ఆ మూవీ కి గ్రేట్ డైరెక్టర్ దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. వక్కతం వంశీ మరియు దాసరి నారాయణరావు కాంబినేషన్ లో కళ్యాణ ప్రాప్తిరస్తు అనే మూవీ తెరకెక్కింది.

 

ఈ మూవీ 1996 వ సంవత్సరం విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో వక్కంతం వంశీ సరసన ప్రస్తుతం బుల్లితెరపై అనేక టీవీ షో లకు యాంకర్ గా వివరిస్తూ … అలాగే అనేక సినిమా ఫంక్షన్ లకు యాంకర్ గా వ్యవహరిస్తున్న సుమ హీరోయిన్ గా నటించింది. ఇలా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన డైరెక్టర్ లలో ఒకరిగా కొనసాగుతున్న వక్కంతం వంశీ హీరోగా తెరకెక్కిన కళ్యాణ ప్రాప్తిరస్తు మూవీలో సుమా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *