Jr ntr : ఆ ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన స్టోరీతో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్న జూనియర్ ఎన్టీఆర్..!
- సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోతో అనుకున్న కథను మరొక హీరోతో తెరకెక్కించడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలా ఒక హీరోతో అనుకున్న కథను మరొక హీరోతో తెరకెక్కించిన సందర్భాలలో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ గా నిలిస్తే … మరికొన్ని సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొంటాయి. ఇది ఇలా ఉంటే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సింహాద్రి మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ద్వారా ఇటు రాజమౌళికి అటు జూనియర్ ఎన్టీఆర్ కు అద్భుతమైన క్రేజ్ లభించింది. ఇది ఇలా ఉంటే సింహాద్రి సినిమా కథ జూనియర్ ఎన్టీఆర్ వద్దకు రావడం కంటే ముందే ఇద్దరు హీరోలు విని రిజెక్ట్ చేశారట. ఆ ఇద్దరు హీరోలు ఎవరు … ఆ విషయాలు ఏమిటో తెలుసుకుందాం. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ “సింహాద్రి” మూవీ కథను మొదటగా బాలకృష్ణ కోసం రాశాడట. ఆ కథను బాలకృష్ణకు వినిపించగా ఆ కథ బాగా నచ్చని బాలకృష్ణ ఈ మూవీని రిజెక్ట్ చేశాడట.
ఆ తర్వాత రాజమౌళి ఈ కథతో మూవీ తీయాలని డిసైడ్ అయ్యాడట. అందులో భాగంగా ఈ కథను మొదటగా ప్రభాస్ కు రాజమౌళి వినిపించాడట. కానీ ప్రభాస్ కూడా ఈ కథను చేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదట. ఆ తర్వాత రాజమౌళి ఇదే కథను ఎన్టీఆర్ కు చెప్పడం , ఎన్టీఆర్ కు ఈ మూవీ కథ అద్భుతంగా నచ్చడం , ఆ తర్వాత ఈ మూవీ తెరకెక్కడం జరిగిపోయాయి. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్నటువంటి బాలకృష్ణ , ప్రభాస్ రిజాక్ట్ చేసిన స్టోరీ తో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు.