HEALTH BENEFITS OF DRY FRUITS : ప్ర‌తిరోజూ డ్రైఫ్రూట్స్ తింటే ఏం జ‌రుగుతుంది..? ఏ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తింటే ఆరోగ్యానికి మంచిందంటే..!

ఈరోజుల్లో ఆరోగ్యం కోసం చాలా మంది డ్రైఫ్రూట్స్ తింటున్నారు. దానికి కార‌ణం డ్రై ఫ్రూట్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. సాధార‌ణంగా డ్రైఫ్రూట్స్ రెండు రకాలుగా ఉంటాయి. కానీ మనం అన్నింటినీ కలిపి డ్రై ఫ్రూట్స్ అంటుంటాం. అంజీర, ఎండుద్రాక్ష, ద్రాక్ష లాంటి వాటిని డ్రై ఫ్రూట్స్ అని అంటారు. జీడి పప్పు, బాదంపప్పు లాంటి వాటిని వాల్ నట్స్ మ‌రియు డ్రై నట్స్ అని అంటారు. ఈ రెండు రకాల రెండు రకాల ప‌దార్థాల‌తోనూ ప్రయోజనాలు ఉంటాయి.

డ్రై ఫ్రూట్ వల్ల కలిగే లాభాలు:-

డ్రైఫ్రూ ట్స్ అనగానే ముందుగా గుర్తొచ్చేది బాదం. బాదం రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. 100 గ్రాముల బాదం పప్పులో 21గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ శ‌రీర‌నిర్మాణానికి స‌హాయ‌ప‌డుతుంది. నాన్ వెజ్ ఇష్టపడని వాళ్ళు రోజూ నానబెట్టిన బాదం తినడం వల్ల శరీరానికి సరిపడా ప్రొటీన్లు అందుతాయి. అంతే కాకుంఆడ ఒమేగా 3, విటమిన్ E సంవృద్దిగా బాదాం లో లాభిస్తాయి. కాబట్టి డ్రై ప్రూట్స్ ని గ్రేట్ ఎనర్జీ ఫుడ్ గా చెప్తారు. రోజూ 2 లేదా 4 డ్రై ప్రూట్స్ ను తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. రక్తంలోని హీమో గ్లోబిన్ మెరుగు పరచడంలో ఇవి సహాయపడతాయి. మలబద్దకం ఉన్న వాళ్ళు డ్రై ప్రూట్స్ తినడం వల్ల ఆ సమస్యని చాలా వరకు తగ్గించుకోవచ్చు. రోజూ డ్రై ప్ఫ్రూ ట్స్ తినడం వల్ల కాంతి వంతమైన చర్మం లభిస్తుంది. అంతే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. డ్రై ఫ్రూట్స్ లో కాల్షియం అధికంగా ల‌భిస్తుంది. ఇది ఎముకలను, దంతాలను బలంగా ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *