RGV with Ashu: అష్షు రెడ్డి కాళ్ళు పట్టుకున్న ఆర్జీవీ….! దానికోసం చివరికి ఇలా అయిపోయారా…?

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వివాదాల దర్శకుడి గా పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. రాంగోపాల్ వర్మ ప్రస్తుతం మీడియాకు కావలసినంత స్టఫ్ ఇస్తున్నారు కానీ సినిమాల్లో మాత్రం స్టఫ్ ఉండటం లేదు. వరుసపెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తున్నా ఒక సినిమా కూడా హిట్ అవడం లేదు. కానీ రీసెంట్ గా ఆర్జీవి వద్దకు క్రేజీ ప్రాజెక్టు వచ్చింది.

 

సీఎం వైఎస్ జగన్ కలిసి మరీ రాబోయే ఎలక్షన్ల కోసం ఓ సినిమా తీయాలని వర్మను కోరినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే వర్మ సినిమాల విషయం పక్కన పెడితే ఎప్పుడూ ఇంటర్వ్యూలు ….ట్వీట్లతో సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటారు. తాజాగా ఆర్జీవి ఆషురెడ్డి తో కలిసి ఇంటర్వ్యూ చేయబోతున్నట్టు సమాచారం. గతంలోనూ ఆర్జీవితో కలిసి బిగ్ బాస్ బ్యూటీ ఓ ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ చాలా వైరల్ అయింది. అంతేకాకుండా ఆ ఇంటర్వ్యూ ద్వారానే అషు పాపులారిటీ పెరిగింది.

 

కేవలం అషు రెడ్డి తోనే కాకుండా ఆర్జీవీ అరియానా తో సైతం ఓ ఇంటర్వ్యూ చేశారు. ఆ వీడియో కూడా యుట్యూబ్ లో వైరల్ అయింది. ఇక ఇప్పుడు ఆర్జీవితో మరో ఇంటర్వ్యూ గురించి అషు రెడ్డి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ఆ పోస్టులో బ్యూటీ కాళ్ళ దగ్గర కూర్చొని ఆర్జీవీ కాళ్ళు పట్టుకున్నాడు. దాంతో పాపులారిటీ కోసం ఇంత దిగజారాలా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *