Rashmika mandana : రష్మికను తొలగించి త్రిషను బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకున్న ప్రముఖ సంస్థ… కారణం అదేనా..!

కన్నడ సినిమా ఇండస్ట్రీ ద్వారా మంచి గుర్తింపుని తెచ్చుకున్న రష్మిక మందన ఆ తరువాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో హీరోయిన్ గా నటించి మరియు ఇతర పాత్రలలో నటించి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపును తెచ్చుకుంది.

 

అలాగే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. ప్రస్తుతం రష్మిక మందన తలపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న వరిసు అనే తమిళ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల కానుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రష్మిక మందన పై కన్నడ సినీ ప్రేమికులు చాలా సీరియస్ గా ఉన్నారు. కన్నడ సినిమా ఇండస్ట్రీ నుండి రష్మిక ను బ్యాన్ చేయాలి అని వరుసగా వారు పోస్టులు పెడుతున్నారు. దీనితో ప్రముఖ జ్యువెలరీ సంస్థ ఖజానా బ్రాండ్ అంబాసిడర్ గా రష్మిక మందన ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.

 

అయితే అనివార్య కారణాల వల్ల రష్మిక మందన ను బ్రాండ్ అంబాసిడర్ గా తొలగిస్తున్నట్లు , త్రిష ను బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకుంటున్నట్లు ఈ సంస్థ వెల్లడించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రష్మిక మందన బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలు మూవీలలో నటిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే రష్మిక మందన నటించిన పలు బాలీవుడ్ మూవీలు విడుదల కూడా అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *