Orange movie : “ఆరెంజ్” మూవీకి మొదట అనుకున్న బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ కెరియర్లో బ్లాక్ బాస్టర్ మూవీ కాకపోయినాప్పటికీ బ్లాక్ బాస్టర్ మూవీ రేంజ్ లో ప్రశంసలను అందుకొని ఇప్పటికి కూడా ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపును దక్కించుకుంటున్న సినిమాలలో ఆరెంజ్ సినిమా ఒకటి.
ఈ మూవీ లో రామ్ చరణ్ సరసన జెనీలియా హీరోయిన్ గా నటించగా, బొమ్మరిల్లు భాస్కర్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. అంజనీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ మూవీని నాగబాబు భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ 26 నవంబర్ 2010 వ సంవత్సరం భారీ అంచనాల నడుమ ధియేటర్లో విడుదల అయింది. కాకపోతే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమా విడుదల అయ్యి ఈరోజుకు 12 సంవత్సరాలు పూర్తి అయింది.
ఇది ఇలా ఉంటే ఈ మూవీ ద్వారా నాగబాబు చాలా నష్టాలను ఎదుర్కొన్నాడు. అలా నాగబాబు “ఆరెంజ్” మూవీ ద్వారా నష్టాలను ఎదుర్కొవడానికి ప్రధాన కారణం… మొదట ఈ మూవీని 30 కోట్లలో రూపొందించాలి అని ప్రణాళికలు వేసుకున్నారట , కాకపోతే ఈ మూవీ బడ్జెట్ 30 కోట్లకు దాటిపోవడం , ఆ తర్వాత ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో , ఆరెంజ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం 20 కోట్ల కలెక్షన్లను మాత్రమే సాధించింది. దానితో నాగబాబు ఈ మూవీ ద్వారా తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.