Jr ntr : ఆయన వర్క్ చేస్తే ఆ మూవీని రీమేక్ చేస్తా… కానీ మూవీలో అది ఉండాల్సిందే… ఎన్టీఆర్..!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీలతో మంచి గుర్తింపును సంపాదించుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సంవత్సరం విడుదల అయిన ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును దక్కించుకున్నాడు ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ తండ్రి అయినటువంటి హరి కృష్ణ కూడా కొన్ని మూవీలలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

 

హరికృష్ణ హీరోగా నటించిన మూవీలలో సీతయ్య మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కి వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించగా , సీతయ్య మూవీ లో హరికృష్ణ సరసన సౌందర్య , సిమ్రాన్ హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు. ఈ మూవీ విజయంలో ఎం ఎం కీరవాణి సంగీతం కూడా కీలకపాత్రను పోషించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఎం ఎం కీరవాణి … జూనియర్ ఎన్టీఆర్ ను ఒక ఇంటర్వ్యూ చేశాడు.

 

ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఎం ఎం కీరవాణి “సీతయ్య” మూవీ ని రీమేక్ చేసే ఉద్దేశం ఉందా అని అడిగాడు. దానితో జూనియర్ ఎన్టీఆర్ “సీతయ్య” రీమేక్ మూవీ కి కూడా మీరే సంగీతం మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ అందించినట్లు అయితే కచ్చితంగా సీతయ్య మూవీ ని రీమిక్ చేస్తాను అని చెప్పాడు. అలాగే ఆ సినిమాలో వినలేదు వినబడదు అనే డైలాగ్ కచ్చితంగా ఉండాలి అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ మరికొన్ని రోజుల్లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుబోయే మూవీలో హీరోగా నటించబోతున్నాడు. ఈ మూవీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయికి మించిన మూవీ గా రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *