Raviteja : రవితేజ ఆఖరి 5 సినిమాల కలెక్షన్ల వివరాలు ఇవే..!

మాస్ మహారాజా రవితేజ ఇప్పటివరకు తన కెరియర్ లో ఎన్నో మూవీలలో నటించాడు. అందులో కొన్ని మూవీలు బ్లాక్ విజయాలను సాధించి అద్భుతమైన కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టాయి. అందులో భాగంగా రవితేజ తన కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్ లను సాధించిన 5 సినిమాలు ఏవో తెలుసుకుందాం.

 

ధమాకా : రవితేజ తాజాగా ఈ మూవీలో హీరోగా నటించాడు. ఈ మూవీతో రవితేజ తన కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్ అందుకున్నాడు. ఈ మూవీ కి కేవలం 15 రోజుల్లోనే 36.60 కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి. ప్రస్తుతం కూడా ఈ మూవీకి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లభిస్తున్నాయి. త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో శ్రీ లీల హీరోయిన్ గా నటించింది.

 

క్రాక్ : రవితేజ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 39.16 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

 

రాజా ది గ్రేట్ : రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 31 కోట్ల కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది.

 

బలుపు : రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 29.30 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

 

పవర్ : రవితేజ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన సినిమా 27.54 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *