Letest news : 2022లో విడుదల అయ్యి అత్యధిక రోజులు 1 క్రోర్ ప్లస్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 మూవీలు ఇవే..!

పోయిన సంవత్సరం అనేక మూవీలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని మూవీలు అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాయి. ఇది ఇలా ఉంటే కొన్ని మూవీ లు చాలా రోజుల పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీగా రన్ ను కూడా కొనసాగించాయి. అందులో భాగంగా పోయిన సంవత్సరం విడుదల అయ్యి … అత్యధిక రోజులు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 10 మూవీ లు ఏవో తెలుసుకుందాం.

 

ఆర్ ఆర్ ఆర్ : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ … ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా 17 రోజుల పాటు 1 కోటి ప్లేస్ షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

 

కే జి ఎఫ్ చాప్టర్ 2 : యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ డబ్బింగ్ సినిమా 12 రోజుల పాటు 1 క్రోర్ ప్లస్ షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

 

ధమాకా : రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా 12 రోజుల పాటు 1 క్రోర్ ప్లస్ షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

 

సర్కారు వారి పాట : మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా 11 రోజుల పాటు 1 క్రోర్ ప్లస్ షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

 

కార్తికేయ 2 : నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా 11 రోజుల పాటు 1 క్రోర్ ప్లస్ షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

 

ఎఫ్ 3 : వెంకటేష్ … వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా … మెహరీన్ హీరోయిన్ లుగా తెరకెక్కిన ఈ మూవీ 7 రోజుల పాటు 1 క్రోర్ ప్లస్ షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

 

భీమ్లా నాయక్ : పవన్ కళ్యాణ్ … దగ్గుపాటి రానా హీరోలుగా తెరకెక్కిన ఈ మూవీ 6 రోజుల పాటు 1 క్రోర్ ప్లస్ షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

 

బింబిసార : కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ 6 రోజుల పాటు 1 క్రోర్ ప్లస్ షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

 

గాడ్ ఫాదర్ : చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఈ సినిమా 6 రోజుల పాటు 1 క్రోర్ ప్లస్ షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

 

కాంతారా : రిషబ్ శెట్టి హీరోగా నటించిన ఈ డబ్బింగ్ సినిమాలో రిషబ్ శెట్టి హీరోగా నటించిన మాత్రమే కాకుండా దర్శకత్వం కూడా వహించాడు. ఈ సినిమా 6 రోజులపాటు 1 క్రోర్ ప్లస్ షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *