Surya : స్టార్ హీరో సూర్య రెండుసార్లు పెళ్లి ఎందుకు చేసుకున్నాడో తెలుసా..?

తమిళ సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి సూర్య గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూర్య తను నటించిన ఎన్నో మూవీ లను తెలుగులో కూడా విడుదల చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు.

 

ఇది ఇలా ఉంటే సూర్య చాలా సంవత్సరాల క్రితమే తెలుగు మరియు తమిళ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కొనసాగుతున్న జ్యోతిక ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే సూర్య … జ్యోతిక ను రెండు సార్లు పెళ్లి చేసుకున్నాడు. అందుకు గల కారణాలు ఏమిటో తెలుసుకుందాం.
సూర్య జ్యోతిక ను పెళ్లి చేసుకుంటాను అని తన తండ్రి కి చెప్పగానే … ఆయన ఒప్పుకోలేదు. దానికి ప్రధాన కారణం సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న అమ్మాయిని చేసుకోవడం సూర్య వాళ్ళ తండ్రికి ఇష్టం లేదు.

 

దానితో సూర్య … జ్యోతిక ను ఇంట్లో తెలియకుండానే పెళ్లి చేసుకున్నాడు. దానితో సూర్య వాళ్ళ నాన్న ఈ విషయం బయట తెలిస్తే బాగోదు అన్న కారణం తో మరోసారి సూర్య కు జ్యోతిక కు పెళ్లి చేశాడు. ఇలా సూర్య … జ్యోతిక ను రెండు సార్లు పెళ్లి చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సూర్య … జ్యోతిక ల సంసారం చాలా చక్కగా కొనసాగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *