Kriti shetty : కృతి శెట్టి “ఉప్పెన” మూవీ చేసే టైమ్ లో ఆమె వయసు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కొనసాగుతున్న కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఉప్పెన మూవీతో వెండితెరకు పరిచయం అయింది. ఈ మూవీలో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించగా , బుచ్చిబాబు సన ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం , అలాగే ఈ మూవీ లో కృతి శెట్టి తన నటనతో , అందచందాలతో ప్రేక్షకులను కట్టి పాడేయడంతో ఈ ముద్దుగుమ్మకు ఉప్పెన మూవీ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కుతున్నాయి.
అందులో భాగంగా ఇప్పటికే కృతి శెట్టి ఈ సంవత్సరం 4 మూవీ లతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సంవత్సరం కృతి శెట్టి నటించిన 4 మూవీ లలో బంగార్రాజు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించగా , మిగతా 3 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులకు నిరాశపరచాలి. అయినప్పటికీ కృతి శెట్టి కి వరుస సినిమా అవకాశాలు దక్కుతున్నాయి.
ఇది ఇలా ఉంటే కృతి శెట్టి “ఉప్పెన” మూవీ చేసే సమయంలో ఆమె వయసు ఎంతో తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. కృతి శెట్టి “ఉప్పెన” మూవీ లో నటిస్తున్న సమయంలో ఆమె వయస్సు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. కృతి శెట్టి 17 సంవత్సరాల వయసులోనే ఉప్పెన మూవీ లో హీరోయిన్ గా నటించిన బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.