Thalapathi vijay : తలపతి విజయ్ “వరిసు” మూవీకి ఎన్ని కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?
తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న తలపతి విజయ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తలపతి విజయ్ “వరిసు” అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , తమన్ ఈ క్రేజీ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.
ఈ మూవీ ని వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై తళపతి విజయ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అసలు విషయం లోకి వెళితే … తలపతి విజయ్ ఈ మూవీ కోసం ఏకంగా 118 కోట్ల రెమ్యూనిరేషన్ ను తీసుకున్నట్లు … తమిళ సినిమా ఇండస్ట్రీ లోనే అత్యధికంగా ఒక హీరో తీసుకున్న రెమ్యూనరేషన్ ఇదే అని ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే తలపతి విజయ్ ఈ మూవీ తర్వాత లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీలో హీరోగా నటించబోతున్నాడు.