PAWAN KALYAN : పవన్ పేరుతో కరాటే కు ఉన్న లింక్ ఏంటి…? కరాటే లో పవన్ కళ్యాణ్ బెల్ట్ ఇదే ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా హరిహర వీరమల్లు సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చాలా రోజుల తర్వాత మళ్లీ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తన కాలేజీ రోజుల్లోనే కరాటే నేర్చుకున్న సంగతి తెలిసిందే.

 

అంతేకాకుండా ఖుషి సినిమాలో తన కరాటే స్టైల్ తో పవన్ కళ్యాణ్ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. కేవలం ఖుషి సినిమాలోనే కాకుండా చాలా సినిమాల్లో పవన్ కళ్యాణ్ తన కరాటే స్కిల్స్ ను బయటపెట్టారు. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాలో కూడా పవన్ తన కరాటే నైపుణ్యాలను చూపించబోతున్నారు.

 

ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ కు కరాటే తో ఎంతో అనుబంధం ఉంది. నిజానికి పవన్ అనే పేరు రావడానికి కూడా కరాటే ఒక కారణం. పవన్ కళ్యాణ్ కాలేజీ రోజుల్లోనే కరాటే లో శిక్షణ తీసుకున్నారు. అంతే కాకుండా కరాటేలో పవన్ బ్లాక్ బెల్ట్ ను సొంతం చేసుకున్నారు.

 

ఓసారి పవన్ కళ్యాణ్ పెద్ద టోర్నమెంట్ లో తన కరాటే విన్యాసాలను ప్రదర్శించారు. ఆ సమయంలోనే ఆయనకు పవన్ అనే పేరును పెట్టారు. అప్పటివరకు పవన్ కళ్యాణ్ అసలు పేరు కేవలం కళ్యాణ్ మాత్రమే… పవన్ అంటే పవన సుతుడు హనుమంతుడు… దృఢమైన వ్యక్తి అని అర్థం వచ్చేలా పవన్ అనే పేరును చేర్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *