MAHESH-PRABHAS : ప్రభాస్ రిజెక్ట్ చేసిన కథతో బ్లాక్ బస్టర్ కొట్టిన మహేష్ బాబు… ఆ సినిమా ఏదంటే..?

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన కథలో మరో హీరో నటించి బ్లాక్ బస్టర్ కొట్టడం కామన్. ఇప్పటివరకు చాలా సినిమాలు అలా చేతులు మారాయి. అయితే మిస్ చేసుకున్న సినిమా సూపర్ హిట్ అయితే మాత్రం హీరో బాధపడాల్సిందే. అలా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఓ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకున్నారు. ఆ సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 

మహేష్ బాబు కెరీర్ లో మొదటగా మాస్ హిట్ వచ్చిన సినిమా ఒక్కడు. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. భూమిక చావ్లా ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. సినిమాలో ప్రకాష్ రాజ్ నటన ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ సినిమాలో డైలాగులు …లవ్ సీన్లు మహేష్ బాబు ప్రకాష్ రాజ్ మధ్య జరిగే వార్ ఇలా ప్రతి ఒక్కటి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

 

ఈ సినిమా యూత్ ఎంటర్టైర్ గా నిలిచింది. అయితే ఈ బ్లాక్ బస్టర్ సినిమాలో మొదటగా గుణశేఖర్ హీరో ప్రభాస్ ను అనుకున్నారు. అంతేకాకుండా ఈ సినిమా కథను గుణశేఖర్ ప్రభాస్ వినిపించారట. కానీ ప్రభాస్ మాత్రం ఈ సినిమా చేయడం రిస్క్ ఏమో అని కథను పక్కన పెట్టారు. ఆ తర్వాత గుణశేఖర్ ఇదే కథను మహేష్ బాబుకి వినిపించారు.

 

కథ విన్న మహేష్ బాబు వెంటనే ఓకే చెప్పారు. అలా ఒకడు సినిమా తెరపైకి వచ్చింది. అలా వచ్చిన ఒక్కడు బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమాను హిందీలో రీమేక్ చేశారు. హిందీలో ఒక్కడు సినిమాను దేవర్ పేరుతో రీమేక్ చేయగా రీమేక్ లో హీరోగా అర్జున్ కపూర్ నటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *