HIT 2 MOVIE REVIEW : “హిట్-2” సినిమా రివ్యూ..అడవిశేష్ కు మరో సాలిడ్ హిట్ పడినట్టేనా..?
సినిమా : హిట్ -2
నటీనటులు : అడవిశేషు, మీనాక్షి చౌదరి, కోమలి ప్రసాద్
దర్శకత్వం : శైలేష్ కొలను
నిర్మాత : నాని
మ్యూజిక్ : సురేష్ బొబ్బిలి
పరిచయం :
ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో హిట్ -2 కూడా ఒకటి. అడవి శేషు ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో అడవి శేషుకు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. నాని నిర్మాతగా హిట్ సినిమా కేస్ వన్ విడుదలైంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించాడు. కాగా కేస్ 2 లో అడవిశేషు హీరోగా నటించాడు. ఈ సినిమా మొత్తం ఏడు కేస్ లు అంటే సిరీస్ గా తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే అడవిశేషు నటించిన హిట్ 2 సినిమా టీజర్ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా భారీ అంచనాల నడుమ డిసెంబర్ 2న ఈ సినిమా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది ఆ అంచనాలను రీచ్ అయ్యిందా లేదా ఇప్పుడు చూద్దాం…
కథ కథనం : ఈ సినిమాలో అడవి శేషు కేడి అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. కేడి మర్డర్స్ క్రైమ్ కేసులను సరదాగా సాలో చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలోనే కేడీకి ఒక మిస్టరీ క్రైమ్ ను కనిపెట్టాలని ఆర్డర్స్ వస్తాయి. దానికోసం కేడి ఎలా కష్టపడతాడు. ఆ క్రైమ్ ను ఎలా కనిపెట్టాడు. సినిమాలో అసలు విలన్ ఎవరు అన్నదే ఈ సినిమా కథ.
విశ్లేషణ :
సినిమా మొత్తం అడవి శేషు వన్ మ్యాన్ షోలా ఉంటుంది. అడవి శేషు ఎక్కడా బోర్ కొట్టనివ్వలేదు. హిట్ పార్ట్ వన్ తోనే శైలేష్ కొలను మంచి డైరెక్టర్ అనిపించుకున్నాడు. స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్నాడు. ఇక హిట్ 2 విషయంలోనూ శైలేష్ ఎక్కడ తగ్గలేదు. రాసుకున్న కథను కరెక్ట్ గా ప్రెసెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. విడుదలకు ముందే ప్రేక్షకులను మెప్పించిన ఊరికే ఉరికే సాంగ్ సినిమా ప్రారంభంలోనే వస్తుంది. ఈ పాట ప్రేక్షకులకు చాలా నచ్చుతుంది. ఈ సినిమాకు జాన్ స్టీవర్ట్ ఏడూరి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అని చెప్పలేం కానీ సినిమాకు సరిపోయేలా ఉంది. అడవి శేషు తో పాటు హీరోయిన్ మీనాక్షి చౌదరి
… రావు రమేష్ ఇతర నటినటులు తమ పెర్ఫార్మెన్స్ తో మెప్పించారు. మొత్తానికి శైలేష్ కొలను అడవి శేషు నుండి ఒక డీసెంట్ త్రిల్లర్ హిట్ -2 అని చెప్పవచ్చు. అంతేకాకుండా హిట్ సినిమా నచ్చిన వాళ్లకు పార్ట్ -2 కూడా కచ్చితంగా నచ్చుతుంది.