RAVITEJA : ఆ స్టార్ హీరో సినిమాకు ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేశాడ‌ని తెలుసా..?

టాలీవుడ్ లో క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చిన వారిలో మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ కూడా ఒక‌రు. ర‌వితేజ ప్ర‌స్తుతం స్టార్ హీరోగా రానిస్తున్నాడు.అయితే కెరీర్ ప్రారంభంలో మాత్రం ఆయ‌న ఎన్నో ఇబ్బందులు ప‌డ్డారు. అంతే కాకుండా న‌టుడుగా ప‌నికిరావు అని ర‌వితేజ‌ను అవ‌మానించిన‌వాళ్లు కూడా ఉన్నారు. అలా అవ‌మానం జ‌రిగిన త‌ర‌వాత ర‌వితేజ న‌ట‌న‌కు నిజంగానే ప‌నికి రానేమో అని అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గానే కొన‌సాగాల‌నుకుని నిర్న‌యించుకున్నారు.

నాగార్జున హీరోగా న‌టించిన నిన్నేపెళ్లాడ‌తా సినిమాకు ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేశారు. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో కృష్ణ వంశీ ర‌వితేజ బాలీవుడ్ న‌టుడు అనిల్ క‌పూర్ ను అనుక‌రించ‌డం చూసి అలా ర‌వితేజ న‌టుడుగా రానించ‌గులుగుతాడ‌ని అనుకున్నాడ‌ట‌. ఈ విష‌యాల‌ను నటుడు బాలాజీ రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *