Ar rehman : రెహమాన్ ఒక్కో మూవీకి తీసుకొనే రెమ్యూనిరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రెహమాన్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీలకు సంగీతం అందించి ప్రపంచవ్యాప్తంగా సంగీత దర్శకుడుగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు.

 

ఇది ఇలా ఉంటే తాజాగా ఏ ఆర్ రెహమాన్ , మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పోన్నియన్ సెల్వన్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీకి సంగీతం అందించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ , భాషలలో భారీ ఎత్తున విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది.

 

ఈ మూవీ విజయంలో ఏ ఆర్ రెహమాన్ అందించిన సంగీతం కూడా కీలక పాత్రను పోషించింది. ఈ మూవీ లో చియాన్ విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష ముఖ్య పాత్రలలో నటించారు. ఇలా తన అద్భుతమైన సంగీతంతో ఎన్నో సినిమాలకు విజయాలను అందించిన ఏ ఆర్ రెహమాన్ ఒక్కో మూవీ కి 6 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *