Adavi shesh : అడవి శేషు కెరియర్లోనే ది బెస్ట్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న “హిట్ 2”..!

కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్న అడవి శేషు “క్షణం” మూవీ తో సోలోగా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత గూడాచారి , , ఎవరు మేజర్ మూవీ లతో వరుస విజయాలను అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన క్రేజ్ ను అమంతం పెంచుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా అడవి శేషు , శైలేష్ కొలను దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని నిర్మాణంలో తెరకెక్కిన హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 2 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా పూర్తి అయింది.

 

ఈ మూవీ కి అడవి శేషు కెరీర్ లో ఇప్పటివరకు ఏ మూవీ కి జరగనంత రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. హిట్ ది సెకండ్ కేస్ మూవీ ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.
నైజాం ఏరియాలో 4 కోట్లు.
సీడెడ్ ఏరియాలో 1.75 కోట్లు.
ఆంధ్ర ఏరియాలో 4.50 కోట్లు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి హిట్ ది సెకండ్ కేస్ మూవీ 10.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది.

కర్ణాటక మరియు రెస్టాఫ్ ఇండియాలో ఈ మూవీకి 1.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే ఓవర్సీస్ లో ఈ మూవీకి 2.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 14.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. 15 కోట్ల షేర్ కలక్షన్ లను కనుక ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసినట్లు అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *