“లవ్ టుడే” మూవీకి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఈ మధ్యకాలంలో భాషతో సంబంధం లేకుండా ఇతర భాషలలో సూపర్ హిట్ అయిన సినిమాలు తెలుగు భాషలో కూడా అద్భుతమైన విజయాలను అందుకుంటున్నాయి. అలా ఇతర భాష సినిమాలు తెలుగులో కూడా మంచి విజయాలను అందుకుంటున్న నేపథ్యంలో తాజాగా తమిళ భాషలో విడుదల అయ్యి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న లవ్ టుడే మూవీ ని అదే పేరుతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగులో విడుదల చేశాడు.

 

ఈ మూవీ నిన్న అనగా నవంబర్ 25 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ ఇప్పటికే తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం , అలాగే ఈ మూవీ కి సంబంధించిన తెలుగు ప్రచార చిత్రాలు కూడా అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. దానితో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్లు లభించాయి.

 

ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.
నైజాం : 86 లక్షలు.
సీడెడ్ : 26 లక్షలు.
ఆంధ్ర : 1.10 కోట్లు.
మొత్తంగా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో లవ్ టుడే మూవీ 1.15 కోట్ల షేర్ , 2.22 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఒక డబ్బింగ్ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రేంజ్ లో ఓపెనింగ్ లు లభించడం అనేది గొప్ప విషయం అని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *