Devi puthrudu : “దేవీపుత్రుడు” చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ తన కెరియర్ లో నటించిన మంచి విజయవంతమైన మూవీలలో ఒకటి అయినటువంటి దేవీ పుత్రుడు మూవీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మూవీ లో సౌందర్య … అంజలి జావేరి హీరోయిన్ లుగా నటించగా … కోడి రామకృష్ణ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

 

ఈ మూవీ 2001 వ సంవత్సరం జనవరి 15 వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన చిన్న పాపకు కూడా ఈ మూవీ ద్వారా అద్భుతమైన గుర్తింపు లభించింది. దేవీ పుత్రుడు మూవీ లో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలో నటించిన పాప పేరు తిమోతియా కాగా ఇప్పుడు ఈ పాప పెరిగి పెద్దది అయ్యింది.

 

ప్రస్తుతం ఈ చిన్న పాప ఏ మాత్రం గుర్తుపట్ట లేకుండా తయారు అయింది. అలాగే కొన్ని సినిమాల్లో కూడా హీరోయిన్ పాత్రలలో నటించింది. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ తెలుగులో హౌస్ ఫుల్ సినిమాలో నటించింది. అలాగే వరుణ్ సందేశ్ హీరోగా నటించిన హ్యాపీ హ్యాపీగా అనే సినిమాలో కూడా నటించింది. కానీ ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *