LAKSHI MIDEVI : ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే ఈ 7 నియమాలు పాటించండి….!
ఇప్పుడున్న రోజుల్లో డబ్బు ఎంతో అవసరం. సంతోషంగా ఉండాలన్నా డబ్బు అవసరమే.. డబ్బు ఉంటే ఇల్లు, ఇంట్లో వస్తువులు ఇలా మనకు ఏది కావాలన్నా కొనుక్కోగలుగుతాము.
కాబట్టి పేదవారిలా ఎవరు ఉండలనుకోరు. అయితే లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ఈ నియమాలను పాటిస్తే చాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ ఏడు నియమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…..
*రోజూవారి పనులు పద్ధతిగా చేస్తే చాలంటున్నారు. అంటే పనులన్నీ క్రమనుసారంగా చేస్తే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకీ వస్తుంది.
*రోజూ స్నానం సూర్యోదయానికి ముందు చేయాలి. అంటే ఉదయం 4 లేదా 5 గంటలకి స్నానం ఆచరించాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా ఇంటితో పాటు మనం శుభ్రంగా ఉండడంవల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి ఇష్టపడుతుంది.
*రోజూ ఇంట్లో దేవుని ముందు నువ్వుల నూనెతో గానీ కొబ్బరినూనెతో గాని
దీపారాధన చేయాలి.
*ప్రధాన ద్వారం తెరిచి మిగతా తలుపులన్నీ వేసి లైట్స్ వేయాలి.
*కొత్తబట్టలు వేసుకునేటప్పుడు దేవుని ముందు పెట్టి పసుపు కుంకుమ వేయడంతో పాటు జేబులో ఒక రుపాయి నీ పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి.
*గుమ్మానికి ఇరువైపులా చెప్పులు కానీ బూట్లు కానీ ఉంచకూడదు.
*ఇంట్లో ఈశాన్యంలో ముగ్గువేసి
రాగిచెంబుకు పసుపు కుంకుమ పెట్టి ,నీళ్ళు తీసుకొని పువ్వులు,అక్షింతలు, వేసి పెట్టాలి.