TEACHER JOBS: తెలంగాణలో కొలువుల జాతర… మరో 12 వేల ఉద్యోగాల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్…!

ఎలక్షన్లు దగ్గర పడుతుండడంతో తెలంగాణ సర్కార్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ లు విడుదల చేస్తోంది. పోలీస్ కొలువులకు తెలంగాణ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రిలిమ్స్ పూర్తి కాగా మెయిన్స్ కు అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు. డిసెంబర్ లో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన ఈవెంట్లు జరగనున్నాయి.

 

అంతేకాకుండా రీసెంట్ గా గ్రూప్ 4 నోటిఫికేషన్ ను సైతం ప్రభుత్వం విడుదల చేసింది. తొమ్మిది వేల ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. ఇక తాజా సమాచారం ప్రకారం… గురుకులాల్లో 12 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు గురుకులాల విద్యాసంస్థల నియామకాల బోర్డు ఇప్పటికే నోటిఫికేషన్ కు సంబంధించిన పనులు ప్రారంభించినట్టు తెలుస్తోంది.

 

ఈనెల మూడవ వారంలోగా నోటిఫికేషన్ ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం అందుతుంది. గతంలో మొత్తం 9036 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వాటితో పాటు మరో మూడు వేల వరకు ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. దాంతో ఒకేసారి 12000 పోస్టులు భర్తీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ పోస్టులలో పిజిటి, టిజిటి ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *