Jr ntr : ఎన్టీఆర్… అనుష్క కాంబినేషన్లో ఆల్మోస్ట్ కన్ఫామ్ అయ్యి ఆగిపోయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ మరియు అందాల ముద్దుగుమ్మ అనుష్క గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతూ ఉంటే … అందాల ముద్దుగుమ్మ అనుష్క కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది.

 

ఇది ఇలా ఉంటే ఇలా అద్భుతమైన క్రేజ్ ఉన్న ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటివరకు ఒక్క మూవీ కూడా తెరకెక్కకలేదు. చింతకాయల రవి మూవీలో ఎన్టీఆర్ ఒక సాంగ్ లో కనిపించినప్పటికీ పూర్తి స్థాయి మూవీలో మాత్రం వీరిద్దరు నటించలేదు. కాకపోతే వీరిద్దరి కాంబినేషన్ లో ఒక మూవీ దాదాపు కన్ఫామ్ అయ్యి చివరి నిమిషంలో ఆగిపోయింది. ఆ మూవీ ఏమిటో తెలుసుకుందాం.

టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన రుద్రమదేవి సినిమాలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీలో గోన గన్నా రెడ్డి పాత్రలో అల్లు అర్జున్ నటించాడు. మొదట ఈ పాత్రను గుణశేఖర్ … ఎన్టీఆర్ కు వినిపించాడట. దాదాపు ఎన్టీఆర్ కూడా ఈ మూవీలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట. కాకపోతే చివరి నిమిషంలో ఈ సినిమాలో తన పాత్ర నిడివి తక్కువగా ఉంది అని కారణంతో ఎన్టీఆర్ ఈ మూవీ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

 

ఆ తర్వాత గుణశేఖర్ “రుద్రమదేవి” మూవీ లోని గోన గన్నా రెడ్డి పాత్ర కోసం అల్లు అర్జున్ ను తీసుకోవడం జరిగింది. ఇది ఇలా ఉంటే రుద్రమదేవి సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఈ మూవీ లోని అల్లు అర్జున్ నటనకు ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి మంచి ప్రశంసలు కూడా లభించాయి. అలా ఎన్టీఆర్ … అనుష్క కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన రుద్రమదేవి మూవీ ఆఖరి నిమిషంలో క్యాన్సల్ అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *