Jr ntr : జూనియర్ ఎన్టీఆర్ కు అస్సలు కలిసి రాని ఆ హీరోయిన్..!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే అనేక మూవీలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే జూనియర్ ఎన్టీఆర్ “ఆర్ఆర్ఆర్” మూవీతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. మరికొన్ని రోజుల్లోనే జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ దర్శకత్వంలో తేరకేక్కబోయే మూవీలో హీరోగా నటించబోతున్నాడు.

 

ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీలో హీరోగా నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ రెండు మూవీలకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ రెండు మూవీలు కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందబోతున్నాయి. ముఖ్యంగా కొరటాల శివ మూవీ పాన్ ఇండియా స్థాయికి మించి తొమ్మిది భాషలలో విడుదల చేయడానికి మూవీ యూనిట్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్ లో ఎంతో మంది హీరోయిన్ లతో ఆడి పాడాడు. కాకపోతే ఒక్క హీరోయిన్ తో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ రెండు మూవీలలో నటించినప్పటికీ , ఆ రెండు మూవీలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోలేదు.

 

ఆ హీరోయిన్ ఎవరో కాదు … ఇలియానా. జూనియర్ ఎన్టీఆర్ , ఇలియానా కాంబినేషన్ లో మొదటగా రాఖీ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ కి విమర్శకుల నుండి మంచి ప్రశంశాలు లభించినప్పటికీ భారీ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేకపోయింది. ఆ తర్వాత వీరిద్దరీ కాంబినేషన్ లో శక్తి మూవీ తెరకెక్కింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరపరాజయాన్ని అందుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *