Akhil Varun tej : నేషనల్ అవార్డు విన్నింగ్ ఫిలింలో నటించే అవకాశాన్ని మిస్ చేసుకున్న అఖిల్… వరుణ్ తేజ్..!
సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోతో అనుకున్న సినిమాను మరో హీరోతో తెరకెక్కించడం… అనేది చాలా వరకు జరుగుతూ ఉంటాయి. అలా జరిగిన కొన్ని సినిమాలు ఇతర హీరోలతో తెరకెక్కించిన సందర్భంలో ఆ సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను సాధించవచ్చు లేక బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టవచ్చు. ఇది ఇలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన హీరోలు అయినటువంటి అక్కినేని అఖిల్ మరియు వరుణ్ తేజ్ లు ఒక నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం ను వదులుకున్నారు. అది ఏ సినిమా అనేది తెలుసుకుందాం.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్న తరుణ్ భాస్కర్ “పెళ్లి చూపులు” మూవీకి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన రీతు వర్మ హీరోయిన్ గా నటించింది. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయిన పెళ్లి చూపులు మూవీ ప్రేక్షకులను విమర్శకులను సైతం మెప్పించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
ఈ మూవీకి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నేషనల్ అవార్డ్ కూడా దక్కింది. ఇది ఇలా ఉంటే మొదటగా పెళ్లి చూపులు మూవీలో విజయ్ దేవరకొండ పాత్రను ఈ మూవీ దర్శకుడు అక్కినేని అఖిల్ కు వినిపించాడట , కాకపోతే ఈ హీరో ఈ మూవీ ని రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత ఈ కథను దర్శకుడు తరుణ్ భాస్కర్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు వినిపించాడట , వరుణ్ తేజ్ కూడా ఈ మూవీ ని రిజెక్ట్ చేశాడట. దానితో ఈ దర్శకుడు విజయ్ దేవరకొండ కు ఈ మూవీ కథను చెప్పి ఒప్పించాడు. ఆ తర్వాత వీరిద్దరు కాంబినేషన్ లో ఈ మూవీ తెరకెక్కి అద్భుతమైన విజయం అందుకుంది.