IMDB : “ఐఎండిబి 2022” లో మోస్ట్ పాపులర్ నటులు వీరే..!

తాజాగా “ఐఎండిబి” సంస్థ 2022 సంవత్సరానికి గాను 10 మంది మోస్ట్ పాపులర్ నటుల జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో మన తెలుగు హీరోలు కూడా ఉన్నారు. మరి ఈ జాబితాలో ఉన్న నటులు ఎవరో తెలుసుకుందాం.

ఈ జాబితాలో మొదటి స్థానంలో కోలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినటువంటి ధనుష్ నిలవగా , రెండవ స్థానంలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నిలిచింది. 3 వ స్థానంలో ఐశ్వర్య రాయ్ నిలవగా , 4 వ స్థానంలో టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిలిచాడు. 5 వ స్థానంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న సమంత నిలవగా , 6 వ స్థానంలో హృతిక్ రోషన్ నిలిచాడు. 7 వ స్థానంలో కియారా అద్వానీ నిలవగా , 8 వ స్థానంలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిలిచాడు. 9 వ స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలవగా , 10 వ స్థానంలో కన్నడ స్టార్ హీరో యాష్ రోషన్ నిలిచాడు. ఇలా “ఐఎండిబి” తాజాగా విడుదల చేసిన జాబితాలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ముగ్గురు హీరోలు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *