CM KCR : కేసీఆర్ ఇంటికి 3 ల‌క్ష‌ల ప‌థకానికి నిబంధ‌న‌లు ఇవే..వాళ్లు మాత్రం అనర్హులు..!

సీఎం కేసీఆర్ రీసెంట్ గా కొత్త పథకాన్ని ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. సొంత భూమి కలిగి ఉన్న వారికి ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం మూడు లక్షల ఆర్థిక సాయం ఇస్తుందని కేసీఆర్ మ‌హ‌బూబ్ న‌గ‌ర్ వేదిక‌గా ప్రకటించారు. కాగా ఇల్లు నిర్మించుకోవాలనుకునే లబ్ధిదారులకు ఉండాల్సిన‌ అర్హతలు, నిబంధ‌న‌ల పై అధికార యంత్రాంగం స‌మావేశం చ‌ర్చించి నిర్న‌యం తీసుకుంది. ఆ అర్హ‌త‌లు, నిబంధ‌న‌లు పాటించిన వారికే మూడు లక్షలు పథకం కింద అందనున్నాయి. ఆ నిబంధనలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం…. ఇల్లు నిర్మించుకునే వాళ్లకు కచ్చితంగా సొంత జాగా ఉండాలి.

 

అదే విధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదలు మాత్ర‌మే ఈ పథకానికి అర్హులు…. విడత‌ల‌ వారిగా మొత్తం మూడు లక్షల సాయాన్ని ఈ పథకం కింద అందజేస్తారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం జరగని గ్రామాలకు మొదట ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంటి నిర్మాణానికి కనిష్టంగా 75 గజాల స్థలం ఉండాలని తెలుస్తోంది. అదేవిధంగా మూడు లక్షల రుణాన్ని కూడా మహిళల పేరిట అందిస్తారని సమాచారం. అంతేకాకుండా తహసిల్దార్, ఎంపీడీవోలు లబ్ధిదారులను గుర్తిస్తే వారిని కలెక్టర్ ఆమోదిస్తారు. కానీ ఎమ్మెల్యేలు… మంత్రుల పరిశీలన తర్వాతనే ఈ లబ్ధిదారుల ఎంపిక జరగనుంది.

 

గతంలో ఇందిరమ్మ ఇల్లు పొందిన వారు ఈ పథకానికి అనర్హులుగా ప్రకటించారు. ఇప్పటికే ఆన్లైన్ లో నమోదు చేయబడిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల‌ వివరాలను పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీలు మ‌రియు ఇతరులు అందరికీ 3 లక్షల సాయం మాత్ర‌మే అందించనున్నారు. ఈ పథకం కింద మొత్తం మూడు లక్షల మందికి సాయం అందే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *