HIT 2 MOVIE : హిట్ 2 సినిమాలోని ప్లస్ లు మైనస్ లు ఇవే….సినిమాకు అదే అతిపెద్ద మైనస్ ఏంటంటే…!

అడవి శేషు హీరోగా నటించిన హిట్ 2 సినిమా డిసెంబర్ 2 న నేడు విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. హిట్ సినిమా సిరీస్ ను ఏడు పార్ట్ లుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా హిట్ పార్ట్ 2 ను నేడు విడుదల చేశారు. ఈ సినిమాలో అడవిశేషు కు జంటగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది.

 

క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. కాగా ఈ సినిమాలోని ప్లస్ లు మైనస్ లు ఏంటో ఇప్పుడు చూద్దాం…. ఈ సినిమా చాలా క్రైం థ్రిల్లర్ సినిమాల మాదిరిగానే ఉంది. రొటీన్ కథ కావడం ఈ సినిమాకు మైనస్… సినిమా ఎక్కడా బోర్ కొట్టకపోయినప్పటికీ కథ మాత్రం రొటీన్ గా అనిపిస్తుంది.

 

ఎక్కడా కొత్తదనం అనిపించదు. అంతేకాకుండా ఈ సినిమాకు మ్యూజిక్ మైనస్ గా నిలిచింది. థ్రిల్లర్ అంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మినిమమ్ ఉంటేనే ప్రేక్షకులు సినిమాలో లీనం అయిపోతారు. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ డల్ గా ఉండటం ప్రేక్షకులను నిరాశపరిచింది. అంతేకాకుండా హిట్ సినిమా సూపర్ హిట్ అవడంతో పార్ట్ 2 పై అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ అంచనాలను దర్శకుడు రీచ్ అవ్వలేకపోయాడు. ఇక సినిమాలోని ప్లస్ పాయింట్ ల విషయానికి వస్తే…. సినిమాలో కేడి పాత్రలో అడవి శేషు పర్ఫెక్ట్ గా కనిపించాడు.

 

ఆటిట్యూడ్ నటనతో ఆకట్టుకున్నాడు. మీనాక్షి చౌదరి తన పాత్రకు న్యాయం చేసింది. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ లో ఉంది. అంతేకాకుండా ఎడిటింగ్ విషయానికి వస్తే అద్భుతమైన ఎడిటింగ్ వర్క్ చేశారు. థ్రిల్లర్ లను ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా ఎంతో థ్రిల్లింగ్ ఇస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ సినిమాను ఓ రేంజ్ లో పైకి లేపుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *