Love today : “లవ్ టుడే” అఫీషియల్ “ఓటిటి” విడుదల తేదీ వచ్చేసింది… ఆ తేదీన… ఆ ఫ్లాట్ ఫామ్ లో..!
ఈ మధ్యకాలంలో సినిమాలు విడుదల అయిన అతి తక్కువ కాలంలోనే “ఓ టి టి” ప్లాట్ ఫామ్ లోకి వచ్చేస్తున్నాయి. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను సాధించినప్పటికీ అతి తక్కువ కాలంలోనే “ఓటిటి” ప్లాట్ ఫామ్ లోకి వస్తున్నాయి. తాజాగా ఈ లిస్ట్ లోకి లవ్ టు డే మూవీ కూడా చేరిపోబోతుంది. లవ్ టుడే మూవీ నవంబర్ 4 వ తేదీన తమిళ భాషలో విడుదల అయింది.
ప్రదీప్ రంగనాథన్ ఈ మూవీ లో హీరోగా నటించగా , ఈ మూవీకి ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ మూవీ ని నవంబర్ 25 వ తేదీన తెలుగు భాషలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశాడు. ఈ మూవీ కి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా బ్లాక్ బస్టర్ టాక్ లభించింది. ప్రస్తుతం ఈ మూవీ కి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించిన “ఓటిటి” విడుదల తేదీ వచ్చేసింది.
ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ “ఓటిటి” సంస్థలలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. ఈ మూవీని డిసెంబర్ 2 వ తేదీన నెట్ ఫ్లిక్స్ “ఓటిటి” లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇలా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న లవ్ టుడే మూవీ అతి తక్కువ రోజుల్లోనే నెట్ ఫ్లిక్స్ “ఓటిటి” ప్లాట్ ఫామ్ లోకి రాబోతుంది.