Balakrishna : బాలకృష్ణ రిజెక్ట్ చేసిన 10 బ్లాక్ బస్టర్ సినిమాలు…అందుకు కారణాలు ఇవే…!
సినిమాల ఎంపికలో హీరోలు చాలా జాగ్రత్తగా ఉంటారు. నచ్చిన కథలను… తమకు సెట్ అవుతాయి అనుకున్న కథలలో నటిస్తారు. ఇక తమకు నచ్చని తమకు సూట్ కావని నమ్మిన కథలను వదులుకుంటారు. అలా నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా కొన్ని సినిమాలను వదులుకున్నారు. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం,… నాగార్జున హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా జానకి రాముడు ఆఫర్ మొదట బాలకృష్ణ వద్దకే వచ్చింది. కానీ ఆయన రిజెక్ట్ చేశారు .దాంతో ఈ సినిమా నాగార్జున వద్దకు వెళ్ళింది.
అదేవిధంగా వెంకటేష్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా చంటి కూడా మొదట బాలకృష్ణ వద్దకు వెళ్ళింది. ఆ తర్వాత ఈ సినిమాను రాజశేఖర్ తో సైతం చేయాలని అనుకున్నారు. కానీ చివరగా ఆ సినిమాలో వెంకటేష్ ఫిక్స్ అయ్యారు. రాజశేఖర్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా సింహరాశి చిత్రానికి సముద్ర దర్శకత్వం వహించారు. ఈ సినిమాను సముద్ర బాలయ్యతో చేయాలనుకున్నారు. కానీ బాలయ్య రిజెక్ట్ చేయడంతో ఆ సినిమా రాజశేఖర్ వద్దకు వెళ్ళింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అన్నవరం సినిమా సైతం మొదట బాలయ్య వద్దకు వెళ్ళింది.
కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించారు. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. వెంకటేష్ హీరోగా నటించిన బాడీగార్డ్ సినిమా మొదట బాలయ్య తో చేయాలనుకున్నారు. కానీ బెల్లంకొండ సురేష్ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసి వెంకటేష్ తో తెరకెక్కించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాకు హీరోగా మొదట బాలయ్యను అనుకున్నారు.
కానీ బాలయ్యకు కథ అంతగా నచ్చలేదు. దాంతో రవితేజ హీరోగా నటించారు. ఇక బాలయ్య గోపీచంద్ కాంబినేషన్లో ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హీరోగా నటించిన సింహాద్రి సినిమా కథను రచయిత విజయేంద్రప్రసాద్ బాలయ్య కోసం రాసుకున్నారు. కానీ బాలయ్య నో చెప్పడంతో రాజమౌళి ఈ సినిమాను ఎన్టీఆర్ తో చేశారు.