మహేష్… పూరి కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్న తమిళ హీరో ఎవరో తెలుసా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు కెరియర్ లో ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లు ఉన్నాయి. అలా మహేష్ బాబు కెరియర్ లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన మూవీ లలో బిజినెస్ మాన్ మూవీ ఒకటి. ఈ మూవీ కి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా , కాజల్ అగర్వాల్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది.

 

ఈ మూవీ ద్వారా మహేష్ బాబు కు మరియు పూరి జగన్నాథ్ కు ప్రేక్షకుల నుండి … విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే పూరి జగన్నాథ్ మొదటగా ఈ మూవీ ని మహేష్ బాబు తో కాకుండా మరో తమిళ హీరోతో చేయాలి అనుకున్నాడు. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ మూవీ ని ఆ తమిళ హీరోతో చేయలేకపోయాడు. ఆ తమిళ హీరో ఎవరో తెలుసుకుందాం.

 

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ “బిజినెస్ మాన్” మూవీ కథను మొదటగా తమిళ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి సూర్య కు వినిపించాడట … కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల సూర్య ఈ మూవీ లో నటించ లేకపోయాడు. ఆ తర్వాత పూరి జగన్నాథ్ … మహేష్ బాబు కు బిజినెస్ మాన్ కథను చెప్పడం … ఆ కథ మహేష్ బాబు కు కూడా సూపర్ గా నచ్చడం తో వీరిద్దరి కాంబినేషన్ లో ఈ మూవీ తెరకెక్కింది. అలాగే బిజినెస్ మాన్ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని కూడా అందుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *