Love Today review : లవ్ టుడే రివ్యూ…! తమిళ్ లో బ్లాక్ బస్టర్ మరి తెలుగులో…?

పరిచయం :

ప్రస్తుతం రీమేక్ ల కంటే డబ్బింగ్ సినిమాలే ఎక్కువ వస్తున్నాయి. ఓటిటి ఎఫెక్ట్ తో ప్రేక్షకులు ఏ భాషలో అయినా సినిమాలు చూస్తున్నారని రీమేక్ చేయకుండా డబ్బింగ్ సినిమాలోనే విడుదల చేస్తున్నారు. రీసెంట్ గా కాంతారా సినిమా అలానే వచ్చి రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తమిళ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన లవ్ టు డే సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు భారీ అంచనాల మధ్య నేడు విడుదలైన ఆ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం….

Love Today movie review

కథ & కథనం :

హీరో ప్రదీప్ ఉత్తమన్ (ప్రదీప్ రంగనాథ్)… హీరోయిన్ నికిత (ఇనావా) ఒకరినొకరు ప్రేమించుకుంటారు. సాధారణంగా బయట ప్రపంచంలో ఎలా లవ్ లో పడతారో వీరిద్దరు కూడా అలాగే ప్రేమలో పడతారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని ఇనావ తండ్రి వేణు శాస్త్రి (సత్యరాజ్) వద్దకు వెళతారు. కాగా వేణు శాస్త్రి ఒక కండిషన్ పెడతాడు. ఇద్దరూ ఫోన్ లు మార్చుకుని ఒక రోజు ఉండండి… ఆ తర్వాత మీరు ఓకే అంటే పెళ్లి చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతాడు. ఆ తర్వాత కండిషన్ కు ఓకే చెప్పిన హీరో… హీరోయిన్ తమ ఫోన్లను మార్చుకుంటారు. అయితే ఆ ఒక్క రోజులో ఏం జరిగింది… ఒకరి గురించి ఒకరు ఎలాంటి విషయాలను తెలుసుకున్నారు. వాళ్ళ నిజస్వరూపాలు తెలిసిన తర్వాత పెళ్లి చేసుకున్నారా…? లేదా అన్నదే ఈ సినిమా కథ.

విశేషణ :

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉంది. యూత్ ఎలా ఉన్నారు…? అనేది ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టుగా చూపించారు. అంతేకాకుండా సోషల్ మీడియా వల్ల ఎలాంటి చెడు ప్రభావాలు ఉన్నాయన్నది కూడా సినిమాలో చూపించారు. సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలతో పాటు యూత్ కి చక్కటి మెసేజ్ ఇచ్చాడు డైెరెక్టర్. ఓవైపు యువతపై సెటైర్లు వేస్తూనే మరోవైపు నవ్వించాడు. అంతేకాకుండా ఫోన్ లోనే మనిషి నిజ స్వరూపం బయటపడుతుందని ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడ బోర్ కొట్టదు. అంతేకాకుండా చాలామందికి తమ రియల్ స్టోరీ అని భావించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాకు యూత్ ఎక్కువగా కనెక్ట్ అవుతారు. అదేవిధంగా ఫ్యామిలీ కూడా ఈ సినిమాను ఎంజాయ్ చేయవచ్చు.

 

నటీనటుల పర్ఫామెన్స్ :

ఈ సినిమాకు హీరో కం దర్శకుడు అయిన ప్రదీప్ నాచురల్ గా నటించి మెప్పించాడు. కథకు తగ్గట్టుగా హీరో నాచురల్ గా కనిపిస్తాడు. హీరోయిన్ ఇనావ.. నిఖిత పాత్రలో అద్భుతంగా నటించింది. అంతేకాకుండా ఈ సినిమా ద్వారా నిఖితకు టాలీవుడ్ లో సైతం అభిమానులు పెరిగే ఛాన్స్ ఉంది. సత్యరాజ్ రాధిక తమ పాత్రలకు న్యాయం చేశారు. అదేవిధంగా యోగిబాబు కామెడీతో నవ్వించడం తో పాటు ఎమోషనల్ సన్నివేశాలతో సైతం మెప్పించాడు. హీరో స్నేహితులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *