Rana daggubati : రానా నటించిన ఆ బ్లాక్ బస్టర్ మూవీకి ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ నటులలో ఒకరు అయినటువంటి దగ్గుపాటి రానా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రానా , శేఖర్ కమల దర్శకత్వంలో తెరకెక్కిన లీడర్ మూవీ తో హీరో గా తన కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అవరేజ్ గా నిలిచినప్పటికీ ఈ మూవీ ద్వారా రానా కు నాకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత రానా తెలుగు భాషలో మాత్రమే కాకుండా అనేక భాషల సినిమాలలో నటించి దేశ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును దక్కించుకున్నాడు.
ఇది ఇలా ఉంటే రానా కెరియర్ లో సోలో హిట్ గా నిలిచిన నేనే రాజు నేనే మంత్రి మూవీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రానా సోలో హీరోగా నేనే రాజు నేనే మంత్రి మూవీ తో మొట్ట మొదటి విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించగా , కాజల్ అగర్వాల్ ,క్యాథరిన్ ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.
అలాగే ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి. ఇది ఇలా ఉంటే రానా కెరియర్ లో బ్లాక్ బాస్టర్ మూవీ గా నిలిచిన నేనే రాజు నేనే మంత్రి మూవీ కథను మొదటగా దర్శకుడు తేజ రాజశేఖర్ కు వినిపించాడట , కాకపోతే క్లైమాక్స్ లో కొన్ని మార్పులు చేర్పులు చేయమని రాజశేఖర్ సూచించడంతో , ఆ మార్పులు చేర్పులు చేయడానికి అంగీకరించని తేజ రానా తో ఈ మూవీ ని తీశాడు. చివరగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకుంది.