Star couple : కేజిఎఫ్ నటుడితో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎంగేజ్మెంట్..!

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి హరి ప్రియ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన పిల్ల జమిందార్ మూవీలో హీరోయిన్ గ నటించి మంచి విజయాన్ని … మంచి గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీలో దగ్గర దక్కించుకుంది.

 

పిల్ల జమిందార్ మూ వీతో బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ ను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు మూవీ లలో నటించి తెలుగు సినీ ప్రేమికులను అలరించింది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న హరి ప్రియ తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ కేజీఎఫ్ మూవీ లో కీలకమైన పాత్రలో నటించిన వశిష్ట సింహ తో ఎంగేజ్మెంట్ ను జరుపుకుంది.

 

తాజాగా వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలను హరి ప్రియ తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేస్తూ … మేమిద్దరం ఒకటి కాబోతున్నాం … మీ ఆశీస్సులు మాకు కావాలి అని ఒక పోస్ట్ చేసింది. ఇది ఇలా ఉంటే వశిష్ట సింహ పాన్ ఇండియా రేంజ్ లో భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన కేజిఎఫ్ మూవీ లో కమల్ పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *