Raviteja : అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న “ధమాకా” మూవీ..!

మాస్ మహారాజ రవితేజ తాజాగా ధమాకా అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని రేపు అనగా డిసెంబర్ 23 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా , అవి అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానితో ఈ మూవీ ని కూడా భారీ ఎత్తున విడుదల చేయడానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేసింది.

 

ఈ మూవీ ని ప్రపంచవ్యాప్తంగా ఎన్ని థియేటర్ లలో విడుదల చేయబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం.
నైజాం ఏరియాలో ఈ మూవీ 5.5 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది.
సీడెడ్ ఏరియాలో 2.5 కోట్లు.
ఆంధ్ర ఏరియాలో 8 కోట్లు.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కలుపుకొని 2.30 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది.

టోటల్ గా ధమాకా మూవీ కి ప్రపంచవ్యాప్తంగా 18.30 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగబోతుంది. ధమాకా మూవీ కనక ప్రపంచవ్యాప్తంగా 19 కోట్ల షేర్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టినట్లయితే ఈ మూవీ క్లీన్ హీట్ గా నిలుస్తుంది. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వం వహించగా , శ్రీ లీల ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *