Nagarjuna : “ది ఘోస్ట్” మూవీకి ఏకంగా అన్ని కోట్ల నష్టం వచ్చిందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అక్కినేని నాగార్జున తాజాగా ది ఘోస్ట్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసింది. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా , అందాల ముద్దుగుమ్మ సోనాల్ చౌహాన్ ఈ మూవీ లో నాగార్జున సరసన హీరోయిన్ గా నటించింది.

 

ఈ మూవీ మంచి అంచనాలు నడుమ ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ లభించింది. అయినప్పటికీ ఈ మూవీ కి భారీ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభించలేదు.

 

దానితో ఈ మూవీ లాంగ్ రన్ లో భారీ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రబట్ట లేక పోయింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ ను కంప్లీట్ చేసుకున్న ది ఘోస్ట్ మూవీ కి 17 కోట్ల మేర నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ది ఘోస్ట్ మూవీ లో దర్శకుడు ప్రవీణ్ సత్తార్ యాక్షన్స్ సన్నివేశాలను చిత్రీకరించిన విధానానికి ఈ దర్శకుడి కి ప్రేక్షకుల నుండి … విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *