Nagma : ఆ ముగ్గురు అక్క చెల్లెళ్లతో నటించిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరంటే..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి కాలంలో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన నగ్మా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నగ్మా ఆ కాలంలో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి తన నటనతో … అందచందాలతో ఎంతో మంది ప్రేక్షకులను కట్టిపడేసింది. నగ్మా తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీలలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అలా నగ్మా తన కెరియర్ లో నటించిన బ్లాక్ బస్టర్ మూవీలలో ఘరానా మొగుడు సినిమా ఒకటి.
ఈ మూవీ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించగా , దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని అద్భుతమైన కలెక్షన్ లను కూడా రాబట్టింది. ఈ మూవీలో నగ్మా తన నటనతో పాటు తన అందచందాలతో కూడా ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి … నగ్మా కాంబినేషన్ కు కూడా ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి నగ్మా తో మాత్రమే కాకుండా తన ఇద్దరు చెల్లెళ్లతో కూడా ఆడి పాడిన విషయం మీకు తెలుసా … మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన మాస్టారు మూవీ లో రోషిని తో మరియు ఠాగూర్ సినిమాలో జ్యోతిక తో కూడా చిరంజీవి నటించారు.
ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా నగ్మా కు చెల్లెల్లే కావడం విశేషం. ఇలా మెగాస్టార్ చిరంజీవి నగ్మా తో పాటు ఆమె ఇద్దరు చెల్లెళ్లతో కూడా నటించాడు. నగ్మా తో సూపర్ హిట్ మూవీలలో నటించిన చిరంజీవి తన ఇద్దరు చెల్లెళ్లతో నటించిన సినిమాలు కూడా సూపర్ హిట్ విజయాలను అందుకోవడం మరో విశేషం.