NAYANATARA : నా మేకప్ రూమ్ లో తారక్ అలాంటి పనులు చేసే వాడు…నయన్ షాకింగ్ కామెంట్స్…!

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార రీసెంట్ గా కనెక్ట్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నయనతారకు తెలుగులోనూ క్రేజ్ ఉండటంతో ఈ సినిమాను తెలుగు తమిళ హిందీ భాషల్లో విడుదల చేశారు. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో నయన్ ఆసక్తికర కామెంట్ లు చేసింది.

 

ఎన్టీఆర్ గురించి చెబుతూ అతనితో తనకు ఉన్న అనుబంధాన్ని వెల్లడించింది. టాలీవుడ్ లోని సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లలో ఎన్టీఆర్ కూడా ఒకరు అని నయనతార వెల్లడించింది. రిహాల్సల్స్ చేయకుండా డైరెక్ట్ గా నటించే ఒకే ఒక్కడు ఎన్టీఆర్ అని ప్రశంసలు కురిపించింది. అంతేకాకుండా ఎన్టీఆర్ డాన్స్ పై సైతం నయనతార ప్రశంసలు కురిపించింది.

 

డాన్స్ కోసం నటన కోసం చాలా కష్టపడతాడని తెలిపింది. ఇక ఎన్టీఆర్ తో కలిసి తాను అదుర్స్ సినిమాలో నటించానని ఆ సినిమా షూటింగ్ సమయంలో… తాను మేకప్ వేసుకుంటున్నప్పుడు అంత టచ్ అప్ అవసరమా అంటూ తనతో మేకప్ రూమ్ లో జోకులు వేసేవాడని చెప్పింది. ప్రస్తుతం నయనతార చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *