Adivi shesh : “అడవి శేష్” ఆఖరి 4 మూవీల మొదటి రోజు కలెక్షన్లు ఇవే..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగి ఉన్న హీరోలలో ఒకరు అయిన అడవి శేషు ఆఖరుగా నటించిన 4 మూవీలు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

గూడచారి : అడవి శేషు హీరోగా తెరకెక్కిన గూడచారి మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 75 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఎవరు : అడవి శేషు హీరోగా తేరకెక్కిన ఈ మూవీలో రాజీనా కేసాండ్రా , నవీన్ చంద్ర ముఖ్య పాత్రలో నటించారు. ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.68 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

మేజర్ ది ఫిలిం : అడవి శేషు కెరీర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీగా విడుదల అయిన ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.07 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

హిట్ ది సెకండ్ కేస్ : అడవి శేష్ తాజాగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీలో హీరోగా నటించాడు. వాల్ పోస్టర్ బ్యానర్ పై నాని నిర్మించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. నిన్న విడుదల అయిన ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.03 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *