Silk Smitha: సిల్క్ స్మిత సగం కొరికిన యాపిల్ పండు పై వేలం పాట…ఎన్ని లక్షలకు కొనుక్కున్నారో తెలుసా..?
చాలామంది సినిమాల్లోకి వస్తారు నటిస్తారు కానీ.. కొంతమంది మాత్రం ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. అలా ప్రేక్షకులు ఎప్పుడూ మర్చిపోలేని పేరు సిల్క్ స్మిత. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన సుబ్బలక్ష్మి సిల్క్ స్మితగా మారింది. చిన్న వయసులోనే తల్లిదండ్రులు పెళ్లి చేయడంతో భర్త పెట్టే టార్చర్ తట్టుకోలేక తన పిన్నితో కలిసి చెన్నైకి వెళ్లిన సుబ్బలక్ష్మి అక్కడ మేకప్ ఆర్టిస్ట్ గా మరో జీవితాన్ని ప్రారంభించింది.
ALSO READ : Nagma : ఆ ముగ్గురు అక్క చెల్లెళ్లతో నటించిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరంటే..?
ఆ సమయంలో ఓ నిర్మాత భార్య సిల్క్ అందాన్ని చూసి ఫిదా అయింది. అలా మొదటిసారి సిల్క్ స్మిత సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత డ్యాన్సర్ గా…బోల్డ్ నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అప్పటి స్టార్ హీరో హీరోయిన్లు సైతం సిల్క్ స్మితను చూసి కుళ్ళుకునేవారు అంటే ఆమె ఏ రేంజ్ లో అభిమానులను సంపాదించుకుందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా సిల్క్ స్మిత డేట్స్ కోసం స్టార్ హీరోలు సైతం ఎదురుచూసిన రోజులు ఉన్నాయి. సిల్క్ స్మిత తన సినీ కెరీర్ లో మొత్తం 300 లకు పైగా చిత్రాలలో నటించింది.
అంతేకాకుండా అప్పటి స్టార్ హీరోయిన్లకు మించిన రెమ్యూనరేషన్ తీసుకున్న రోజులు సైతం ఉన్నాయి. సినిమాల్లో ఎంతో సక్సెస్ అయిన సిల్క్ స్మిత ఓ వ్యక్తితో చేతిలో దారుణంగా మోసపోయింది. నమ్మిన వాడే మోసం చేయడంతో సిల్క్ ఆ బాధను భరించలేక ఆత్మహత్య చేసుకుంది… అయితే సిల్క్ చనిపోయినా ఆమెకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా సిల్క్స్ స్మిత కు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అప్పట్లో సిల్క్స్మిత క్రేజ్ వల్ల ఆమె కొరికిన యాపిల్ పండును కూడా వేశారట. అయితే ఆ ఆపిల్ పండుకు ఏకంగా 2 లక్షల రూపాయల వేలం ధర పలికినట్టు తెలుస్తోంది. సిల్క్ కొరికిన యాపిల్ కే 2 లక్షలు ఉన్నాయి. అంటే ఆమె రేంజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
ALSO READ : Surya : స్టార్ హీరో సూర్య రెండుసార్లు పెళ్లి ఎందుకు చేసుకున్నాడో తెలుసా..?