RAMCHARAN : ఆ విష‌యంలో య‌ష్, ఎన్టీఆర్ ల‌ను వెన‌క్కి నెట్టేసిన రామ్ చ‌ర‌ణ్‌..?

మెగాస్టార్ త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చ‌ర‌ణ్ వ‌రుస సినిమాల‌తో పుల్ బిజీగా ఉన్నాడు. మ‌గ‌ధీర‌తో స్టార్ హీరోగా మారిపోయాడు. రంగ‌స్థ‌లం సినిమాతో చెర్రీ త‌నలోని న‌టుడిని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశాడు. ఇక రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చ‌ర‌ణ్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ సినిమా త‌ర‌వాత చ‌ర‌ణ్ అస్స‌లు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. అయితే చ‌ర‌ణ్ తో పాటూ పాన్ ఇండియా హీరోలుగా మారిన య‌ష్ ఎన్టీఆర్ మాత్రం త‌ర‌వాత సినిమాల విష‌యంలో చ‌ర‌ణ్ కంటే వెన‌క‌బ‌డ్డారు.

 

ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కొర‌టాల శిత‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా 2023లో విడుద‌ల కానుంది. అంతే కాకుండా ఈ సినిమా త‌ర‌వాత ప్ర‌శాంత్ నీల్ తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఇదిలా ఉంటే రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం శంక‌ర్ దర్శ‌క‌త్వంలో ఓ పాన్ ఇండియా సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అంతే కాకుండా ఇదిలా ఉండ‌గానే రేపు బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ సీ 16 అనౌన్స్మెంట్ రానుంది. ఇది ఇలా ఉంటే ఆ త‌ర‌వాత సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చ‌ర‌ణ్ ఓ సినిమాలో న‌టించ‌నున్నాడు. ఇక య‌ష్ విష‌యానికి వ‌స్తే ఇప్ప‌టి వ‌ర‌కూ కిరాత‌క అనే ఒకే సినిమాను అనౌన్స్ చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *