Adivi shesh : “హిట్ 2″డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ “ఓటిటి” సంస్థ..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి అడవి శేషు గురించి ప్రత్యేకంగా తెలుగు చని ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అడవి శేషు తాజాగా హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీలో హీరోగా నటించాడు. ఈ మూవీ డిసెంబర్ 2 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ప్రస్తుతం ఈ మూవీ విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది.

 

ఇప్పటికే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని లాభాలను అందుకుంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

హిట్ ది సెకండ్ కేస్ మూవీ యొక్క “ఓ టి టి” హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థలలో ఒకటి అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకున్నట్లు , కొన్ని వారాల ధియేటర్ రన్ ముగిసిన తర్వాత ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ “ఓ టి టి” ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మూవీ థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతూ అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *