AARYA -2 MOVIE : యూత్ ఫేవరెట్ ఆర్య-2 సినిమాకు 13 ఏళ్లు…ఈ సినిమాకు ఇన్ని అవార్డులు వచ్చాయో తెలుసా..?
అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ కు ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అల్లు అర్జున్ ఆర్య సినిమాతోనే టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఆర్య 2 సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. తాను రాసిన కథలలో తన ఫేవరెట్ కథ కూడా ఆర్య 2 అని సుకుమార్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అయితే ఈ సినిమా ఎబో యావరేజ్ గా నిలిచింది. కానీ ఈ సినిమాకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఎప్పుడు టీవీలో వచ్చినా ఆర్య 2 సినిమాను మిస్ కాకుండా చూసే ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ అందించిన మ్యూజిక్ యూత్ ను ఫిదా చేసింది. ఇక సినిమాలో హీరోగా అల్లు అర్జున్ నటించగా అల్లు అర్జున్ స్నేహితుడి పాత్రలో నవదీప్ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించారు.
అయితే ఈ సినిమాను కొంతమంది ఫ్లాప్ సినిమా ఫ్లాప్ సినిమా అని కామెంట్ చేస్తుంటారు. కానీ ఈ సినిమా కు అప్పట్లో వచ్చిన అవార్డులు ప్రశంసల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ సినిమా 6 విభాగాల్లో ఫిలింఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యింది. ఒక సినిమా ఈ రేంజ్ లో ఫిలింఫేర్ అవార్డలకు నామినేషన్ లో నిలవడం చాలా అరుదు. ఈ సినిమాతో బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్…. బెస్ట్ డైరెక్టర్ గా సుకుమార్…. బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ప్రేమ్ రక్షిత్ నామినేట్ అయ్యారు. అంతే కాకుండా రింగ రింగా ఐటమ్ సాంగ్ కు బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా ప్రియా హితేష్ అవార్డును అందుకున్నారు.