Vishwak sen : ఫ్రీగా “ఓరి దేవుడా” మూవీ..!

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి విశ్వక్ సేన్ కొన్ని రోజుల క్రితమే ఓరి దేవుడా అనే మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీకి అశ్విత్ మరిముత్తు దర్శకత్వం వహించగా , మిథాలీ పాల్కర్ ఈ మూవీ లో విశ్వక్ సేన్ సరసన హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి విక్టరీ వెంకటేష్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు.

 

విక్టరీ వెంకటేష్ ఈ మూవీ లో నటించినది చాలా తక్కువ నిడివి ఉన్న పాత్రే అయినప్పటికీ తన పాత్రతో విక్టరీ వెంకటేష్ ఈ మూవీ కి చాలా హెల్ప్ అయ్యాడు. కొన్ని రోజుల క్రితం మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. అలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఓరి దేవుడా మూవీ కొన్ని రోజుల నుండి ఆహా “ఓ టి టి” ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ కి ఆహా “ఓ టి టి” ప్లాట్ ఫామ్ లో సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.

 

ఇది ఇలా ఉంటే తాజాగా ఆహా “ఓ టి టి” ప్లాట్ ఫామ్ వారు ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ యొక్క మొదటి 10 నిమిషాలను ఫ్రీ గా చూసుకునే వెసులు బాటు ను కల్పించింది. అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా తాజాగా ఆహా “ఓ టి టి” ప్లాట్ ఫామ్ ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *